వేంపల్లి: కర్నూలులో హైకోర్టు బెంచ్ హర్షణీయం

83చూసినవారు
కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని ఏపీ సిసి ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి పేర్కొన్నారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ నుంచి కార్యాలయాలు అమరావతికి తరలించటం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే తరలింపు కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్