10వ తరగతి విద్యార్థులకు వంద రోజులప్రణాళికలో భాగంగా రెండవ శనివారం, ఆదివారాలు, పండుగ సెలవు దినాలలో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం, మధ్యాహ్న భోజనం వసతి కల్పించాలని డిటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టుబడి గౌస్ లాజమ్, మారుతి ప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ.. దూరప్రాంతాల నుండి వచ్చే బాలికలకు రక్షణ వుండదని వాటిని సెలవు దినాలుగా ప్రకటించాలని కోరుతున్నట్లు తెలిపారు.