సి. కే పల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన సంధ్య ( 26 ) అనే మహిళ గత కొంతకాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ మనస్థాపానికి గురై తన ఇంటిలోనే పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి సంధ్యను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.