సింగనమల మండలం చిలేపల్లి వంక నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేయకుండా సోమవారం పోలీసులు గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శరత్ చంద్ర మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసు గస్తీని ఏర్పాటు చేశామన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల ప్రజలకు హెచ్చరించారు.