చింతల వెంకటరమణుడికి పట్టువస్త్రాల సమర్పణ

74చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని చింతల వెంకటరమణస్వామి ఆలయంలో గురువారం స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 19వ తేదీ వరకు జరగనున్నాయి. అందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ఉమారెడ్డి కలిసి ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్