తాడిపత్రి: రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే: జేసీ ప్రభాకర్ రెడ్డి (వీడియో)

50చూసినవారు
ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా కాదని, పర్మినెంట్‌గా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం ఆటోలేనని మండిపడ్డారు. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవటం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. త్రీ వీలర్స్‌ను బ్యాన్ చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్