ఉదయగిరి: లక్ష సభ్యత్వాలు టార్గెట్ గా ముందుకు సాగాలి: ఎమ్మెల్యే కాకర్ల
ఉదయగిరి నియోజకవర్గం లోని పెద్ద మండలాల్లో 15000, చిన్న మండలాల్లో 10000 సభ్యత్వాలే టార్గెట్ గా టిడిపి నాయకులందరూ ముందుకు సాగాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ముందుగా ప్రజలకు సభ్యత్వం యొక్క బెనిఫిట్స్ వివరించాలని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గం లోని మొత్తం 143 పంచాయతీలు కలిపి లక్ష సభ్యత్వాలు నమోదు చేసే విధంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు.