ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నరవాడ పంచాయతీ లిని వెంగమాంబ కాలనీలో శనివారం బిజెపి కిసాన్ మేర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి నాయుడు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజలకు సూచనలు చేశారు. మాల్యాద్రి నాయుడు విన్నపం మేరకు వైద్యులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.