ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని దుత్తలూరు హెల్త్ సూపర్వైజర్ షేక్. ఖాజా మొహిద్దిన్ తెలిపారు. శనివారం మండలంలోని సోమల రేగడ ఎస్టి కాలనీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓవర్ హెడ్ ట్యాంకులలో క్లోరినేషన్ చేపట్టాలని, ప్రతి ఒక్కరు బిందే నీటిలో క్లోరిన్ మాత్రను వేసుకుని తాగాలని సూచించారు. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.