ఉరవకొండ: శ్రీ దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

68చూసినవారు
ఉరవకొండ: శ్రీ దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు
ఉరవకొండ పట్టణంలో స్థానిక ఉరగాద్రి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం శ్రీ దుర్గాదేవి అలంకరణలో చౌడేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయం నుంచి విశేషంగా అభిషేకాలు, కుంకమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్