ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో ప్రసిద్ధ దేవాలయం శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో సూర్య భగవానుడిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారి దర్శనం కోసం చుట్టుప్రక్కల నుంచి భక్తులు తరలి వచ్చారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.