ఉరవకొండ: రైతులను చిప్ తో మోసం చేసిన వ్యాపారులు

77చూసినవారు
ఉరవకొండ: రైతులను చిప్ తో మోసం చేసిన వ్యాపారులు
వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో ఘరానా మోసం శుక్రవారం బయటపడింది. గ్రామ రైతులు కందులను వ్యాపారులకు విక్రయించారు. ఎలక్ట్రానిక్ కాటా యంత్రంలో తూకం వేయగా అందులో తేడాను రైతులు గమనించారు. వ్యాపారస్థులు తీసుకొచ్చిన కాటా యంత్రం, కందులు తరలించడానికి వచ్చిన లారీలను రైతులు వజ్రకరూరు పోలీసులకు అప్పగించారు. తూనికల శాఖ అధికారులు యంత్రాన్ని పరిశీలించగా అందులో చిప్ అమర్చినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్