ఉరవకొండ మండలం నేరిమట్ల గ్రామ సర్పంచ్ యోగేంద్రరెడ్డి పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా యోగేంద్రరెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్, నియోజకవర్గ సమన్వయకర్త వై. విశ్వేశ్వరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.