జిల్లాలోని తహశీల్దార్ల నియామకంతో పరిపాలన ఊపందుకోనుంది. ఇటీవల జరిగిన ఎన్నికలకు పొరుగు జిల్లాలనుండి ఎన్నికలవిధులు నిర్వహించిన తహశీల్దార్ లు పూర్తిస్థాయిలో పరిపాలన పై దృష్టి సారించలేదు. బుధవారం సాయంత్రం తహశీల్దార్ నియామకం జాబితాను విడుదల చేయడంతో ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో పొందూరు తహశీల్దార్ గాఎం రమేష్ కుమార్, సరుబుజ్జిలి తహశీల్దార్ గా ఎల్ మధుసూదన్, బూర్జ జే ఈశ్వరమ్మ ను తహశీల్దార్ లుగా నియమించారు.