ఆమదాలవలస: డిగ్రీ పరీక్ష కేంద్రంలో బెంచీల కొరత

61చూసినవారు
ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఐదవ సెమిస్టర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులకు సరిపడే సంఖ్యలో రూములు, బెంచీలు లేకపోవడంతో పరీక్షలు రాసిన విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణీలకు కూడా బయట వరండాలో కూర్చుని పెట్టి పరీక్షలు నిర్వహించారని అన్నారు. అడిగిన వారిపై కళాశాల సిబ్బంది దురుసుగా వ్యవహరించారని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్