లావేరు మండలం లక్ష్మీనారాయణ పురం గ్రామంలో శనివారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రత్యేకించి మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు నివారణ కోసం విషముసిడి 380 లీటర్లు తయారు చేయు విధానం గురించి మండలం ప్రకృతి వ్యవసాయం సిబ్బంది అప్పారావు, రాంబాబు, సోమశేఖర్, వివరించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల తక్కువ పెట్టుబడులతో పంటలను సాగు చేయవచ్చునని తెలిపారు.