ఆముదాలవలస 15 వార్డు మౌనింగావారి వీధిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు చెరువుగా మారింది. రోడ్డుకి ఇరువైపులా కాలువ వ్యవస్థ లేకపోవడంతో వర్షం నీరు బయటికి వెళ్లలేక రోడ్డు మీద ఉండిపోతుంది. దీంతో నిత్యం ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కాల్వ నిర్మించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.