మార్కెట్ యార్డ్ లో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ
పొందూరు మార్కెట్ యార్డ్ లో బుధవారం కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు మాట్లాడుతూ. శ్రామిక వర్గాల హక్కుల కోసం, ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథసారధిగా సీతారాం ఏచూరి అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. సీతారాం ఏచూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు.