విజయవాడ వరద బాధితులకు ఆమదాలవలసలో భవిత స్కూల్ విద్యార్థులు బుధవారం తమ వంతుగా 30 వేల రూపాయలను విరాళంగా సేకరించారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి పంపిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ మురళీధర్ రావు, డైరెక్టర్ సునీత వెల్లడించారు. పాఠశాల హెచ్ఎం కే వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.