బూర్జ మండలం తోటవాడ గ్రామంలో బుధవారం పర్యటించినట్లు సర్పంచ్ సూర ఆనందరావు తెలిపారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు, పాడి పశువుల వ్యర్ధాలు మురుగునీటి కాలువల్లో వేయొద్దని గ్రామస్తులకు పంచాయతీ కార్యదర్శి టి. సుధాకర్ సూచించారు. అంటు రోగాలపై జాగ్రత్త వహించాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పించారన్నారు.