రణస్థలం మండలం రెడ్దిక మెంటాడ గ్రామంలో సోమవారం హిజ్రాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను హిజ్రాలు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. హిజ్రాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త విశ్వక్షేణ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.