తుది దశలో డా. బిఆర్ ఏయూ పరిపాలనా భవన పనులు

55చూసినవారు
తుది దశలో డా. బిఆర్ ఏయూ పరిపాలనా భవన పనులు
సుమారు 35కోట్ల వ్యయంతో ఎచ్చెర్లలో నిర్మాణం చేపట్టిన డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిపాలనా భవన పనులు తుది దశకు చేరుకున్నాయని వర్సిటీ వీసీ కేఆర్ రజిని అన్నారు. మంగళవారం నిర్మాణం చేపడుతున్న వర్సిటీ పనులను ఉన్నతాధికారులతో కలిసి వీసి పరిశీలించారు. ముందుగా చేపడుతున్న పనులపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ భవనం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్