జనావాసాల మధ్య మద్యం దుకాణం వద్దని పైడిభీమవరంలో మహిళలు ఆందోళనకు దిగారు. రణస్థలం మండలం పైడిభీమవరంలో ఉన్న వైన్ షాపులు ఎదుట మహిళలు గురువారం ధర్నా చేశారు. నివాస ప్రాంతాల మధ్య మద్యం షాపు వద్దని చెప్పినా యజమానులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మద్యం తాగిన వారు రాత్రి సమయాల్లో గొడవలకు దిగుతున్నారని తెలిపారు. దీంతో మహిళలు, విద్యార్థులు, పిల్లలు భయాందోళనలు చెందుతున్నామని ఆవేదన చెందారు.