కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో నెట్వర్క్ సమస్యతో పెన్షన్ పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయింది. స్థానిక గ్రామంలో ఎన్నో ఏళ్లుగా నెట్వర్క్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేయదలిచినా. పనులు పూర్తి చేయకుండా నిలిపివేశారు. గ్రామంలో ఫైబర్ నెట్వర్క్ మీద ఆధారపడి పెన్షన్ పంపిణీ జరిగేదని సిబ్బంది తెలిపారు. దీనిపై దృష్టి సారించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.