శ్రీకాకుళం: మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన అవసరం

70చూసినవారు
శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గురువారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. సురేఖ మాట్లాడుతూ. విద్యార్థులు మంచితనంతో ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి. ఎస్. పి శేషాద్రి, దానేటి శ్రీధర్, ఏబీవీపీ సభ్యులు గోపి, మదన్, బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.