సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది కోడి పందేలు. ఈ క్రమంలో ఏలూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం, గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, YSR జిల్లాల నుంచి కొందరు తక్కువ ధరకు మేలైన పుంజులను కొనుగోలు చేసి.. పందేలకు సిద్ధం చేసి విక్రయిస్తున్నారు. డేగ, కాకి డేగ, కొక్కిరాయి, అబ్రాస్, తెలుపు, నలుపు నెమళ్లు తదితర పేర్లతో పిలిచే కోళ్లకు గిరాకీ ఎక్కువగా ఉంది. దీంతో కొన్నిచోట్ల ఒక్కోదాన్ని రూ.25వేల నుంచి రూ.50వేల వరకు విక్రయిస్తున్నారు.