పొందూరు: సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించుకోవాలి

82చూసినవారు
పొందూరు: సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించుకోవాలి
నేటి సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆధ్మాత్మిక, సేవాభావం అవసరమని, హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. పొందూరు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఉన్న శ్రీ ఆనందాశ్రమం 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన హిందూ ధార్మిక మహా సమ్మేళనంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు నేడు క్షణం తీరికలేని జీవితం గడుపుతున్నారని, ఆధ్యాత్మిక చింతన వైపు దృష్టి సారించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్