బూర్జ: పంట పొలాలకు అందని సాగునీరు.. రైతుల ఆందోళన
నాగావళి నది చెంతనే ఉన్న పంట పొలాలకు సాగునీరు లేక రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బూర్జ మండలంలోని పలు గ్రామాల్లోని పంటలను ఆయన పరిశీలించారు. నీరు ఆనకట్టలో ప్రవహించక ఇసుక మేటలు, తుప్పలు, గుర్రపు డెక్కతో కాలువాలు దర్శనమిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.