రణస్థలం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గొర్లెపేటలోని సచివాలయం వద్ద బుధవారం రాత్రి భారీ చెట్టు నేలకూలింది. ఒక్కసారిగా భారీ గాలి వీయడంతో పక్కనున్న విద్యుత్ స్తంభంపై చెట్టు పడటంతో స్తంభం కూలిపోయింది. అటువైపుగా ఎవరూ వెళ్ళకుండా స్థానిక యువత చర్యలు తీసుకున్నారు. విద్యుత్ అధికారులకు సమాచారం స్థానికులు అందజేశారు. సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.