ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామానికి చెందిన నంబాడ లక్ష్మి పెంకుటిల్లు తుఫాన్ ప్రభావంతో గాలులు, వర్షం కారణంగా బుధవారం నేలమట్టమయింది. పెంకుటిల్లు వంట గదిలో ఉన్న సామగ్రి మొత్తం నాశనం అయిందని బాధితురాలు వాపోయింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపించుకున్నారు. పూర్తిగా ఆస్తి నష్టం వాటిల్లిందని, అధికారులు స్పందించి తగిన పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.