పట్టపగలే బ్యాంకులో దోపిడీ.. గన్స్‌తో బెదిరించి (వీడియో)

73చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా బ్యాంకులో చొరబడి సిబ్బందిని బెదిరించి డబ్బు దోచుకెళ్లారు. ఈ ఘటన యూపీలోని సహరాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. బ్యాంకులో సిబ్బంది తమ పనిలో నిమగ్నమై ఉండగా నలుగురు ఆగంతకులు చొరబడ్డారు. వారి వద్ద ఉన్న గన్స్ తీసి సిబ్బందిని బెదిరించారు. రూ.1.5 లక్షల నగదును కాజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్