తమ పాలనలో యువతకు ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ఒకటిన్నర ఏళ్లలోనే ఇంత పెద్ద మొత్తంలో కొలువులు కల్పించామన్నారు. ఇది దేశ చరిత్రలో పెద్ద రికార్డ్ అని పేర్కొన్నారు. నేడు జరుగుతున్న రోజ్‌గార్ మేళాలోనూ 71,000 మందికి పైగా యువతకు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చామని తెలిపారు. ఇలాగే ముందుకు సాగితే 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని ప్రధాని వ్యాఖ్యానించారు.