ఏపీలోని పల్నాడు జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన షేక్ బాజీ ఇంట్లోకి 10 అడుగుల భారీ కొండచిలువ దూరింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో.. గ్రామస్తులంతా కలిసి దానిని చంపేశారు. అనంతరం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఫారెస్ట్ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.