ఎచ్చెర్ల: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి
ఈనెల 10న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఎచ్చెర్ల కు చెందిన త్రినాధరావు(53) మంగళవారం శ్రీకాకుళం రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్. ఐ చిరంజీవి తెలిపారు. కుమ్మరిగుంట గ్రామానికి చెందిన ఈ వ్యక్తి గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, బాధలను తట్టుకోలేక గడ్డి మందు తాగినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారన్నారు. ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశామన్నారు.