రణస్థలం మండలం పైడి భీమవరంలో గల ఓ ఫార్మ పెన్సిలిన్ ప్లాంట్ లిఫ్ట్ వద్ద సోమవారం ప్రమాదవశాత్తు క్యాంటీన్ కార్మికురాలు డి. రామలక్ష్మి(40) మృతి చెందారు. ప్రమాదంలో చనిపోయిన రామలక్ష్మి కుటుంబాన్ని సీఐటీయూ నాయకులు పరామర్శించారు. రూ. 50 లక్షల నష్టపరిహారం తక్షణమే యాజమాన్యం చెల్లించి ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సిఐటియు నాయకులు అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు.