ప్రజా దర్బార్ లో ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అధికారులకు ఆదేశించారు. సోమవారం రణస్థలం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. 15 రోజుల్లో అధికారులు అర్జీలను పరిష్కరించకపోతే సమస్య తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.