రణస్థలం: లిఫ్ట్ ప్రమాదంలో కార్మికురాలి మృతి
రణస్థలం మండలం పైడి భీమవరంలోని ఓ ఫార్మ పెన్సిలిన్ ప్లాంట్ లిఫ్ట్ వద్ద సోమవారం ప్రమాదవశాత్తు క్యాంటీన్ కార్మికురాలు డి. రామలక్ష్మి(40) మృతి చెందారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమ్మితం తరలించారు. ప్రమాదంలో చనిపోయిన రామలక్ష్మి కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం తక్షణమే యాజమాన్యం చెల్లించి ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.