జి. సిగడాం నుంచి నరసింహపురం మధ్యలో రైల్వే ట్రాక్ పక్కన ఓ వ్యక్తి కాలుజారీ పడిపోయాడు. రైల్వే ట్రాక్‌మెన్ గుర్తించి 108కి సమాచారం అందించారు. ఒడిశాలో గంజాం జిల్లాకు చెందిన హెన్నాగౌడ్గా గుర్తించారు. ఘటనా స్థలానికి అంబులెన్స్ వెళ్లలేకపోవడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాక్ వెంబడి నడుచుకొని వెళ్లి బాధితున్ని స్థానికుల సహకారంతో 108 ఎక్కించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు.