కష్టపడి ఇష్టంతో చదవి మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఇచ్ఛాపురంలోని బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్దులకు ఉచిత పాఠ్యపుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత శిక్షణ పొందిన అధ్యాపకులు బోధిస్తున్నారని అన్నారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సర్వసౌకర్యాలు ఉన్నాయని అన్నారు.