రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ అన్నారు. ఉద్యానశాఖ, సమికృత ఉద్దాన అభివృద్ధి మిషిన్, రాష్ట్రీయ కృషి వికాష యోజన సౌజన్యంతో రూ. 15లక్షలతో నిర్మించిన కొబ్బరి రైతు ఉత్పత్తిదారుల సేకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కేంద్రం కొబ్బరి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.