శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జాడుపూడి ఆర్ఎస్ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం కూటమి శ్రేణులు ప్రారంభించారు. ఇందులో భాగంగా భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న రోడ్డు సమస్యను పరిష్కారం లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రహదారుల రూపురేఖలు మారాయని కూటమి నేతలు తెలిపారు.