Oct 07, 2024, 07:10 IST/
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 25 మందికి గాయాలు
Oct 07, 2024, 07:10 IST
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనస్కాంతలో దంత ప్రాంతానికి సమీపంలో ఉన్న త్రిసూలియా ఘాట్ వద్ద దాదాపు 35 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.