HDFC బ్యాంక్ తన కస్టమర్‌లకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేటు (MCLR) పెంచుతున్నట్లు HDFC బ్యాంక్ సోమవారం ప్రకటించింది. సవరించిన లోన్ వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. 6 నెలల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును, మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్లు వెల్లడించింది. మిగితా టెన్యూర్ MCLR రేటును యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.