కవిటి: ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది

85చూసినవారు
కవిటి: ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది
కవిటి మండలం జాడుపూడి ఆర్ఎస్ లో శనివారం దీపం-2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగింది. ఎంపీటీసీ ప్రతినిధి సంతోష్ పట్నాయక్, టీడీపీ మండల అధ్యక్షుడు మణిచంద్ర ప్రకాశ్ లబ్దిదారులకు సిలిండర్లు అందజేశారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ లను కూటమి ప్రభుత్వం అందిస్తుందని సంతోష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఈ పథకం గర్వించ దగ్గదని పేర్కొన్నారు. కూటమి నేతలు, లబ్దిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్