సారవకోట మండలం నందు మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు సారవకోట టిడిపి రథసారథి, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించి అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు తనపై తన కార్యకర్తలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.