రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, పాలకొండ 108 సిబ్బంది గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. లేదంటే దశల వారీగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.