పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రెల్లి వీధిలో నిరుపయోగంగా ఉన్న బావిలో ప్రమాదవశాత్తు కాలుజారిపడి దున్న వీరస్వామి (57) మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. మృతుడు ఇచ్ఛాపురం పట్టణం నీలకంఠేశ్వర స్వామి వీదికి చెందిన వ్యక్తి ఉపాధి నిమిత్తం కాశీబుగ్గలోని ఓ బేకరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు వెలికి తీశారు.