ఎల్.ఎన్.పేట మండలాభివృద్ధికి అన్ని విధాల కృషి: ఎమ్మెల్యే

80చూసినవారు
పాతపట్నం నియోజకవర్గం ఎల్. ఎన్. పేట మండల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే హాజరయ్యారు. మండలంలో వివిధ రకాల పనులకు సంబంధించిన మండల తీర్మానం ఇవ్వాలని ఎంపీపీకి ఎమ్మెల్యే సూచించారు. పార్టీలకు అతీతంగా మండల అభివృద్ధి జరగాలని ఎమ్మెల్యే అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పారు.

సంబంధిత పోస్ట్