పాతపట్నం: 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

70చూసినవారు
పాతపట్నం: 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
పాతపట్నం మండలం చాపరాయి గూడ గ్రామంలో ఆదివారం పాతపట్నం ఎక్సైజ్ అధికారులు సీఐ కె. కృష్ణారావు, ఎస్ఐ బి. శ్రీనివాసరావు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి కోసం ప్లాస్టిక్ డ్రమ్ములతో నింపి ఉన్న 400 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. అనంతరం నిందితుల కోసం గాలించగా ఎటువంటి సమాచారం దొరకలేదని, కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కృష్ణారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్