గిరిజనులకు రాయితీపై విత్తనాలు పంపిణీ

83చూసినవారు
గిరిజనులకు రాయితీపై విత్తనాలు పంపిణీ
గిరిజనులు అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక ఆదాయం పొందేవిధంగా కొత్తూరు వెలుగు అసోసియేషన్ సహకారం అందిస్తుందని పలువురు అసోసియేషన్ సభ్యులు అన్నారు. సోమవారం మెళియాపుట్టి మండలంలోని గొడ్డగ్రామంలో కేరాసింగి, నేలబొంతు, ఆంజనేయపురం, పొగడవెల్లి, గొడ్డ గ్రామంలో 80శాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. గిరిజనుల భూముల్లో పండించడానికి అనువైన కొండచీపుర్లు, చిరుధాన్యాలు, కూరగాయలు పలు రకాల విత్తనాలను అందించారు.

సంబంధిత పోస్ట్